రూల్స్ పేరు తో రైల్వే శాఖ కొత్త దందా..!

post

రైల్వే శాఖ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. ఈసారి వీటిని ఆటోవాలాలు, టాక్సీ వాలాల మీద వదిలింది. ఇకనుంచి, వారు స్టేషన్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవడానికి కూడా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించకపోతే, వారికి లోపలి రావడానికి అనుమతి ఉండదు. సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైల్వే అధికారులు కొత్త నిబంధనలను విడుదల చేసారు. సికింద్రాబాద్ డివిజన్ లోని అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ నియమాలు వర్తిస్తాయని రైల్వే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్ స్టేషన్ వద్ద టోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీజు పేరుతో వసూళ్లు కొనసాగుతున్నాయి.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..!

ఇప్పటివరకు ఆటో లు గాని క్యాబ్ లు గాని స్టేషన్ లోపలి వచ్చి ప్రయాణికులను పికప్ చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా, రద్దీ ని తగ్గించడం కోసం వారిని లైన్లో పంపడం లాంటి పద్దతులను అమలు చేస్తున్నారు. తాజాగా, ఫీజు వసూలు చేసే నిబంధనను తీసుకువచ్చారు. స్టేషన్ లోపలి రావడానికి, ఆటో లేదా క్యాబ్ డ్రైవర్లు ముందుగానే పేరు నమోదు చేసుకుని, ఆధార్ కార్డు తో సహా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డు, వెహికల్ రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డ్రైవింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని డాక్యూమెంట్లు పర్ఫెక్ట్ ఉన్న పక్షం లో ఓ అధికారిక నెంబర్ ను వారు ఇస్తారు. ఆ తరువాత నిర్ణయించిన ఫీజు ను చెల్లించాల్సి ఉంటుంది.

అధికం గా పార్కింగ్ వసూళ్లు..!

సికింద్రాబాద్ స్టేషన్ మెయింటెనెన్సు ను ఓ ప్రైవేటు సంస్థ కు అప్పచెప్పారు. దానితో వారు ఇష్టారాజ్యం గా వసూళ్లు మొదలెట్టారు. ఇప్పటికే అధికం గా పార్కింగ్ ఫీజులను ప్రయాణికులపై వేస్తున్నారు. ప్రయాణికులను పికప్ చేసుకునేటప్పుడు లేదా డ్రాప్ చేసేటపుడు ఎక్కువ సమయం ఉంటె ఛార్జ్ వసూలు చేస్తున్నారు. ఇందుకోసం మొదటి ఐదు నిమిషాలు ఉచితం గా ప్రకటించి, అంతకంటే ఎక్కువ సమయం వేచి ఉంటె ఫీజు వసూలు చేయనున్నారు. 5 నుంచి 15 నిమిషాల మధ్య ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టే చేస్తే రూ.100, 15 నుంచి 30 నిమిషాల మధ్య అయితే రూ.200 విధిస్తున్నారు. 30 నిమిషాలు, ఆపైన ఉంటే రూ.1,000తో పాటు అదనంగా టోయింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చార్జీలు విధిస్తున్నారు.

        మామూలుగానే, రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అన్నా ఆటో లు క్యాబ్ లు అధికం గా చార్జీలు వసూలు చేస్తారు. అలాంటిది, ఇపుడు కొత్త నిబంధనలు అమలైతే ఆ భారం ఎక్కువ గా సాధారణ ప్రజలపైనే పడనుంది. కాగా, ఈ నిబంధనల పట్ల యూనియన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సంపాదించుకునే అరా కొరా డబ్బుల్ని కూడా రైల్వే శాఖ కు చెల్లించాలంటే ఎలా..? అని ఆగ్రహిస్తున్నాయి. రైల్వే శాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యమం మొదలు పెడతామని యూనియన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.