ఏపీ లో తోలి కరోనా కేసు..!

post

ఆంధ్రప్రదేశ్ లో తోలి కరోనా కేసు నమోదు ఐంది. ఇటలీ నుంచి నెల్లూరు కు వచ్చిన ఓ వ్యక్తి గత కొన్ని రోజులుగా దగ్గు, జలుబు, జ్వరం తో బాధ పడుతున్నాడు. కాగా, కరోనా వైరస్ లక్షణాలు కనిపించడం తో అతన్ని నెల్లూరు లో ప్రభుత్వాసుపత్రి లో జాయిన్ చేసారు. ప్రస్తుతం అతన్ని ఐసోలేషన్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అతనిలో కరోనా వైరస్ లక్షణాలు ఉండటం తో, అతని నుంచి శాంపిల్ స్వీకరించి, పూణే కు పంపించారు. కాగా, రిపోర్టు లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అక్కడి డాక్టర్లు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తి చర్యలు వేగవంతం చేస్తున్నారు.