కరోనా వైరస్ లు ఎక్కించుకోండి.. మూడు లక్షలు ఇస్తాం..!

post

ఇదేంటా అని ఆశ్చర్యపోతున్నారా.? కొత్తగా, లండన్ పరిశోధకులు ఈ ఆఫర్ ఇస్తాం అంటున్నారు. ఓ పక్క కరోనా వైరస్ ప్రబలి ప్రపంచ దేశాలు అల్లాడిపోతుంటే, ఈ అల్లరి ఆఫర్లు ఏంటి అనుకోకండి. వాళ్ళకి రీసెర్చ్ చేయడానికి ఓ ఆరోగ్యవంతమైన వ్యక్తి లో కరోనా వైరస్ ఎలా పని ప్రారంభిస్తుంది అనే విషయాలు తెలియాలి మరి. అందుకే ఈ తిప్పంతా.

    వివరాల్లోకెళితే, లండన్ కు చెందిన ఓ పరిశోధనల బృందం కరోనా జాతికి చెందిన ఓసీ43, 229ఈ వైరస్ లపై పరిశోధనలు చేయాలనుకుంటోంది. ఇందుకోసం ఈ ప్రకటనను విడుదల చేసింది. తమ పరిశోధన ల కోసం కరోనా వైరస్ ను శరీరం లో ఎక్కించుకున్న వారికి మూడు లక్షలు బహుమతి గా ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఇప్పటికే చాల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారుట.

    పేర్లను నమోదు చేసుకున్నవారిలో, ఆరోగ్యం గా ఉన్న వారిని వివిధ బ్యాచులుగా విభజించి వారికీ కరోనా వైరస్ లను ఎక్కించి పరిశోధనలు జరుపుతారు. ఈ కరోనా వైరస్ లు ఎక్కించుకోవడం వల్ల శ్వాస కోస ఇబ్బందులు తలెత్తుతాయి. కానీ, ప్రాణాపాయం ఏమి ఉండదని పరిశోధకులు హామీ ఇస్తున్నారు. ఓ వైపు కరోనా జాతికే చెందిన కోవిద్-19 ప్రపంచదేశాలను వణికిస్తున్న నేపధ్యం లో, వీరు ఇలాంటి ఆఫర్ ఇవ్వడం పట్ల సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి.