దారి చూపినోడు..ఇక లేడు..!

post

అతనో మనసున్న మారాజు. చదువుకున్నా, సరైన ఉద్యోగం లేక దొరికిన పని చేసుకుంటున్నాడు. తనలాగా తన ఊరి వాళ్ళు కాకూడదని, వారికి తనకు తెలిసిన చోట్ల ఉద్యోగం ఇప్పించి సాయం చేస్తున్నాడు. ఇంతలోనే, అతన్ని విధి వక్రించింది. మియాపూర్ పరిధిలో జరిగినా రోడ్ ఆక్సిడెంట్ లో అతను ఘటన స్థలం లోనే మృతి చెందాడు. అతను దారి చూపినోళ్లంతా నేడు మూగబోయారు. అతని మరణాన్ని తట్టుకోలేక భోరున విలపిస్తున్నారు. అది చుసిన అక్కడి స్థానికులే ఆశ్చర్య పోతున్నారు. అతని సేవాగుణమే అతనిని ఇంతమంది కి చేరువ చేసిందని చెప్పుకుంటున్నారు.

         వివరాల్లోకెళితే, పోలీసులు చెప్పిన కధనం ప్రకారం..భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రాంపురం గ్రామానికి చెందిన సుమన్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. కాగా, అతను ఉద్యోగం కోసం నగరానికి వచ్చాడు. సరైన ఉద్యోగం దొరక్కపోవడం తో, ఫుడ్ డెలివరీ బాయ్ గా చేరాడు. అతని భార్య ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి గా ఉంది.

          నగరానికి వచ్చి సర్దుకున్నాక, తనలాంటి వారికి ఓ తోడు అవ్వాలి అనుకున్నాడు. ఊరి నుంచి తనలా ఉద్యోగం కోసం వచ్చే వారికీ ఓ దారి చూపిస్తున్నాడు. తనకు తెలిసిన చోట్ల ఉద్యోగం ఇప్పిస్తున్నాడు. ఆలా ఇప్పటికే చాలామందికి దారి చూపించాడు.

          నిన్న మియాపూర్ లోని ఓ హోటల్ నుంచి ఆహారం తీసుకుని జాతీయ రహదారి పై వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు. సుమన్ మృతి వార్త తెల్వగానే, అతని స్నేహితులు పెద్ద ఎత్తున వచ్చారు. బంధు మిత్రుల కన్నా వారి వేదన వర్ణనాతీతం గా ఉంది. అది చూసి అక్కడి స్థానికులే ఆశ్చర్య పోతున్నారు.