వారం లో తేరుకుంటాం.. : ఎస్ బ్యాంకు ఎండి

post

ఎస్ బ్యాంకు పై ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీనితో ఎస్ బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన మొదలై గందరగోళ పరిస్థితులకు దారి తీసింది. ఎస్ బ్యాంకు లో 49 % వాటాను కొంటామని ఇటీవల ఎస్బిఐ ప్రకటించింది. దీనితో పరిస్థితి కొంచం చక్కబడింది.  కాగా, ఎస్ బ్యాంకు పై విధించిన ఆంక్షలను ఈ వారం చివరి లో ఎత్తివేయొచ్చని ఎడ్మినిస్ట్రేటర్‌‌ ప్రశాంత్‌‌ కుమార్‌‌ తెలిపారు. ఎస్బిఐ నాయకత్వం లో సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్ ను రిజర్వు బ్యాంకు ఆమోదిస్తే, ఈ మారటోరియం నుంచి బయటపడే ఛాన్స్ ఉంది. 
      యెస్ బ్యాంకు డిపాజిట్లు రూ. 2.09 లక్షల కోట్లు గా ఉంది. కనీస కాపిటల్ ను సమీకరించలేకపోవడం తో, ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ప్రస్తుతం బోర్డు ను రద్దు చేసి అడ్మినిస్ట్రేటర్ గా ప్రశాంత్ కుమార్ ను నియమించింది. రీస్ట్రక్చర్ ను చేయడానికే ఎస్ బ్యాంకు ను రిజర్వు బ్యాంకు పరిధిలోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 
సీబీఐ సోదాలు..!
  ఎస్ బ్యాంకు పై సిబిఐ సోదాలు నిర్వహించింది. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ కపూర్‌‌ కుటుంబానికి  ఇచ్చిన రూ. 600 కోట్ల లంచంపై కూడా దృష్టి సారించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉన్న నిందితుల ఇళ్లను, ఆఫీసులను, సీబీఐ అధికారులను తనిఖీ చేస్తున్నారు. డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ షార్ట్‌‌టర్మ్‌‌ డిబెంచర్స్‌‌లో డబ్బు పెట్టినందుకు గాను, ప్రతిఫలం గా కపూర్‌‌ కూతుళ్లు పెట్టిన డూఇట్‌‌ అర్బన్‌‌ వెంచర్స్‌‌ (ఇండియా)కు వాధ్వాన్‌‌లు అప్పులిచ్చేలా కుట్ర జరిగిందని సీబీఐ ఆరోపిస్తోంది. 2018 జూన్-ఏప్రిల్ నెలల మధ్యలో డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ 3700 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ తో సంబంధం ఉన్న ఆర్‌‌కేడబ్ల్యూ డెవలపర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌కు ఎస్ బ్యాంకు 750 కోట్లను ఇచ్చిందని సీబీఐ తెలిపింది. ఐతే, ఈ కారణం కోసం ఆర్‌‌కేడబ్ల్యూ డెవలపర్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ అప్పు తీసుకుందో, అందుకోసం కాక ఆ డబ్బు ను డీహెచ్‌‌ఎఫ్‌‌ఎల్‌‌ కు సమర్పించినట్లు సిబిఐ అధికారులు చెబుతున్నారు. ఇందుకు ప్రతి ఫలం గా కపూర్‌‌ కూతుళ్ల కంపెనీకి వాధ్వాన్‌‌లు (డీహెచ్ఎఫ్‌‌ఎల్‌‌) రూ. 600 కోట్ల అప్పును ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు, దివాన్ హోసింగ్ లిమిటెడ్ 97 వేల కోట్ల అప్పును బ్యాంకుల వద్ద నుంచి తీసుకుని డొల్ల కంపెనీ లకు తరలించారని ఆరోపణలు ఉన్నాయి.
ఎస్బిఐ ఎంట్రీ తో పెరిగిన షేర్లు..!
ఎస్ బ్యాంకు వాటాను కొంటామని ఎస్బిఐ ప్రకటించడం తో సోమవారం సెషన్లో యెస్‌‌ బ్యాంక్‌‌ షేర్లు 32 శాతం పెరిగాయి. ఎస్ బ్యాంకు లో షేర్లను  రూ. 2,450 కోట్లతో కొనడానికి ఎస్ బి ఐ అంగీకరించింది. ఈ నేపధ్యం లో ఎస్ బ్యాంకు షేరు 40.7 శాతం పెరిగి రూ. 22.80 ని చేరుకుంది. మొత్తానికి 31.17 శాతం లాభంతో రూ. 21.25 వద్ద ముగిసింది. బీఎస్‌‌ఈలో ఈ షేర్‌‌ ట్రేడింగ్‌‌ వాల్యూమ్‌‌ 3.22 రెట్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఎస్ బ్యాంకు షేర్ ముఖ విలువ రెండు రూపాయలుగా ఉంది. మొత్తం 255  కోట్ల షేర్లను కలిగి ఉంది. కాగా, ఎస్బిఐ కు షేర్ ముఖ విలువ రూ. పది తో, 245 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నారు. ఇందుకోసం ఎస్బిఐ 2,450 కోట్లను వెచ్చిస్తోంది. ఎస్ బ్యాంకు ను రీ కన్స్ట్రక్షన్ చేయడానికి పదివేలకోట్లదాకా ఖర్చు చేయాలనీ అనుకుంటున్నట్లు ఎస్‌‌బీఐ ఛైర్మన్‌‌ రజ్‌‌నీష్‌‌ కుమార్‌‌ తెలిపారు.