ఇరాన్ లోని భారతీయులకు ఊరట..!

post

చైనా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకి మహమ్మారి గా మరి వణికిస్తోంది. చైనా లో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానం ద్వారా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా, ఇరాన్ లో చిక్కుకున్న భారతీయులను తీసుకువచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపధ్యం లో, ఇరాన్ లో చిక్కుకున్న 58 మంది భారతీయులను వాయుసేన వెస్ట్రన్ కమాండ్ అయిన హిండోన్‌ కు చేరుకుంది. వారికోసం వెళ్లిన వాయుసేన విమానం కొద్దీ సేపట్లో చేరుకుంటుంది అని విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ ట్వీట్ చేసిన వెంటనే, వారి విమానం హిండోన్‌ లో ల్యాండ్ అయింది. ఈ సందర్భం గా విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ రాయబార కార్యాలయ అధికారులకు, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

చైనా తరువాత ఇరాన్..!

కరోనా వైరస్ వల్ల సంభవిస్తున్న మరణాలలో చైనా ముందుంది. అక్కడ వేలల్లో మృత్యువాత పడుతుంటే, లక్షల సంఖ్యలో కరోనా అనుమానితులు ఆసుపత్రిలో చేరుతున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి చైనా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం, చైనా పరిస్థితి దయనీయం గా ఉంది. ఇది ఇలా ఉంటె, చైనా తరువాత ఇరాన్ లో అత్యధిక స్థాయి లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇరాన్ లో ఇప్పటిదాకా  230 మంది కోవిడ్-19 కారణంగా మృత్యువాత పడ్డారు. ఒక్క రాజధాని టెహ్రాన్‌లోనే 1945 కేసులు నమోదు అవడం ఆ ప్రాంత వాసుల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఇరాన్‌లోని క్వామ్ నగరంలో ఉన్న మరో 40 మంది భారతీయులకు వైద్య సాయం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకం గా ఢిల్లీ నుంచి వైద్య బృందాన్ని పంపింది.