ఉత్తమ విమానాశ్రయం గా 'శంషాబాద్ విమానాశ్రయం'..!

post

హైదరాబాద్ వద్దనున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం గా ఎన్నో జాతీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలకు నిలయం గా ఉంది. తాజాగా, ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో గుర్తింపు లభించింది. 2019 వ సంవత్సరానికి గాను, శంషాబాద్ విమానాశ్రయాన్ని ఉత్తమ అంతర్జాతీయ విమానాశ్రయం గా గుర్తించి, ఎంపిక చేసారు. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ శంషాబాద్ విమానాశ్రయానికి ‘ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) పురస్కారాన్ని ప్రకటించింది.
      ఆసియా దేశాల్లో, దాదాపు రెండు కోట్ల వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించే విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంపికైంది. ప్రయాణికుల అవసరాలను దృష్టి లో ఉంచుకుని సేవలను అందించడం తో పాటు, భద్రతా విషయం లో మెరుగైన సేవలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అందిస్తోంది. అంతేకాకుండా, పర్యావరణం పై కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తోంది. ఈ అంశాలకు గుర్తింపు గా ‘ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్‌క్యూ) అవార్డు లభించింది. 
       ఈ ఏడాది సెప్టెంబర్ లో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సమ్మిట్ లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈ అవార్డు ను అందుకోనుంది. ఈ అవార్డు రావడం పట్ల శంషాబాద్ సీఈఓ  సీఈవో ఎస్‌జీకే కిషోర్ సంతోషం గా ఉన్నారు.