సీఎం జగన్‌ తో సుబ్బరామిరెడ్డి భేటీ..!

post

ఆంధ్రప్రదేశ్‌  సీఎం జగన్‌ తో భేటీ అయ్యారు.  రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తి రేపుతోంది. వచ్చేనెలతో సుబ్బరామిరెడ్డి రాజ్యసభ  పదవీకాలం ముగుస్తుంది. దీనిపైనే ఆయన చర్చలు జరుపుతున్నారా? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. అయితే త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఏపీ నుంచి వైసీపీ అభ్యర్థులు ఎవరనే విషయంపై ఇప్పటికే  జగన్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీ డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకట రమణ, గుంటూరు నేత అయోధ్య రామిరెడ్డిలను సీఎం జగన్‌ రాజ్యసభకు పంపనున్నట్లు సమాచారం. మరో సీటు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి లేదా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేట్‌ వ్యవహారాల విభాగం అధ్యక్షుడు, ఎంపీ పరిమళ్‌ సత్వానీకి ఇస్తారని ప్రచారం జరిగుతుంది.