బండారు దత్తాత్రేయకు అస్వస్థత..!

post

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఛాతీ నొప్పితో బాధ పడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హిమాయత్ నగర్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దత్తాత్రేయకి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే దత్తాత్రేయ గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో బాధ పడుతున్నారని వైద్యులు తెలిపారు. గుండె కొట్టుకునే వేగం కాస్త మందగించిందని ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. సాయంత్రానికల్లా దత్తాత్రేయని డిశ్చార్జి చేసే అవకాశాలున్నాయి.