కశ్మీర్ లో కొత్త రాజకీయ పార్టీ..!

post

జమ్ముకశ్మీర్ లో మరో రాజకీయ పార్టీ ఏర్పాటయింది. పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మాజీ నాయకుడు అల్తఫ్ బుఖారీ జమ్ము  అండ్ కశ్మీర్ అప్నే(జేకేఏపీ)  పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంబించారు. గత ఏడాది ఆగష్టు 5న కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనితో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు ఊరట నివ్వడమే పార్టీ లక్ష్యమని బుఖారీ తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కశ్మీర్ సంక్షోభంలో వుందని గత ఏడు నెలల్లో టూరిజం జీరో స్దాయికి చేరుకుని పరిశ్రమలు మూత పడ్డాయని ఆయన అన్నారు. వీటన్నంటిని అధిగమించడమే కశ్మీర్ ల ముందున్న అతిపెద్ద సవాల్ అని ఆయన అన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఆవిర్బవించిన ఈ కొత్త పార్టీలోకి పీడీపీ, నేషనల్ కాన్పరెన్స్, ( ఎన్ సీ) కాంగ్రెస్ నుంచి  31 మంది  నాయకులు క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. పీడీపీ నుంచి ఉస్మాన్ మజీద్, అయిజాజ్ ఖాన్, ముంతాజ్ ఖాన్, , కాంగ్రెస్ నుంచి షోయబ్ నబీలోన్, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సయ్యద్ అస్గర్ ఆలీ, కమల్ అరోరా తదితరులు జేకేఏపీలో చేరుతున్నారు. కశ్మీర్ కు చెందిన రెండు రాజకీయ పార్టీలు పీడీపీ, ఎన్ సీ లు వారసత్వ రాజకీయాలకు చిరునామాగా వుండగా ఈ కొత్త పార్టీ ఈ రెండింటికి భిన్నంగా వుండటం వలన కశ్మీర్ రాజకీయాల్లో సరికొత్త మార్పులు వచ్చే అవకాశముంది. .