అమరావతి గ్రామాల్లో స్థానిక ఎన్నికలు లేవు..!

post

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో స్థానిక ఎన్నికల హంగామా మొదలైన సంగతి తెలిసిందే.ఇటీవలే, ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ కూడా విడుదల అయింది. అయితే, ఈ ఎన్నికల నుంచి అమరావతి గ్రామాలకు మినహాయింపును ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని తెలుస్తోంది.

    రాజధాని గ్రామాలను ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ పరిధిలోకి తీసురాబోతున్నట్లు, అందుకే స్థానిక ఎన్నికలకు మినహాయింపు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, మరి కొన్ని గ్రామాలను కూడా ఇతర మునిసిపాలిటీల్లో విలీనం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కారణాలతో రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలకు మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. తుళ్లూరు మండలంలోని గ్రామాలతో పాటు నీరుకొండ, నిడమర్రు, కృష్ణాయపాలెం, కురగల్లు గ్రామాలను కలుపుకుని అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నారు.బేతపూడి, నవులూరు, యర్రబాలెం గ్రామాలను మంగళగిరి పురపాలక సంఘం లోను, ఉండవల్లి, పెనుమాక గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీ లోను కలపాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ ప్రాంతాల్లో ఎన్నికలు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.