ఫైనల్స్ లో భారత్ నిరాశగా..!

post

ఉమెన్స్ టోర్నీ మొదలైన నాటి నుంచి అపజయం లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత మహిళా క్రికెట్ టీమ్ కు ఫైనల్స్ లో చుక్కెదురైంది. సవాళ్ళను ఎదుర్కొంటు వరుస విజయాలతో తుది వరకు చేరుకున్న భారత జట్టు ఆఖరి మెట్టు వద్ద వెనుకడుగేసింది. మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమ్‌ఇండియా జట్టు ఓడిపోయింది. బౌలింగ్ లోను, బ్యాటింగ్ లోను వైఫల్యం చెంది తొలిసారి కప్పు గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయింది. దీనితో, ఆసీస్ జట్టు వరుసగా ఐదోసారి కప్పు అందుకోనుంది. ముందు బ్యాటింగ్ ను తీసుకున్న ఆసీస్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. అలిస్సా హీలి (75; 39 బంతుల్లో 7x4, 5x6), బెత్‌ మూనీ (78*; 54 బంతుల్లో 10x4) తో అర్ధ శతకాలు సొంతం చేసుకున్నారు. ఆ తరువాత బాటింగ్ తీసుకున్న భారత్ 19.1 ఓవర్లలోనే 99 పరుగులకే ఆటను ముగించింది. దీప్తి శర్మ (33; 35 బంతుల్లో; 2×4) మాదిరిగా ఆడింది. ఆసీస్ బౌలర్లలో షట్ (4/18), జొనాసెన్‌ (3/20 ) తమ ప్రతిభను చాటుకున్నారు.