మీ డబ్బు మీరు తీసుకోండి : ఎస్ బ్యాంకు

post

ఎస్ బ్యాంకు సంక్షోభం లో పడ్డ నేపధ్యం లో యాభై వేలకు మించి నిధులు విత్ డ్రా చేయరాదని ఆర్బిఐ ఎస్ బ్యాంకుకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే, ఒక్కసారిగా ఎస్ బ్యాంకు ఖాతాదారులంతా ఎటిఎం ల వెంట పడ్డారు. డబ్బు రాకపోవడం, ఆన్ లైన్ ద్వారా కూడా ట్రాన్స్ఫర్ చేయడం సాధ్యం కాకపోవడం తో అంతా గందరగోళం పరిస్థితి నెలకొంది. ఈ నేపధ్యం ఆర్బీఐ గవర్నర్, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ స్పందించడం తో పరిస్థితి కొంతవరకు చక్కబడింది.

     డబ్బులు వెనక్కి రావేమో, పంజాబ్ నేషనల్ బ్యాంకు తరహాలోనే తాము కూడా డబ్బులు వదులుకోవాల్సి వస్తుందేమో అనుకుంటున్న ఖాతాదారులందరికి ఎస్ బ్యాంకు శుభవార్త చెప్పింది. ఇక మీ డబ్బులు మీరు విత్ డ్రా చేసుకోవచ్చని శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత ట్విట్టర్ వేదికగా తెలిపింది. 'మీ ఎస్ బ్యాంక్ డెబిట్ గార్డు ఉపయోగించుకుని యస్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఎంతో ఓపిగ్గా ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు'. అని ట్వీట్ చేసింది.

       మనీ లాండరింగ్ చట్టం కింద స్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఆదివారం తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతం లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఆయనను కస్టడీ కోసం స్థానిక కోర్టులో ప్రవేశపెట్టనుంది. సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ఎస్ బ్యాంకులోని నలభై శాతం వాటాను తీసుకునేందుకు ఎస్బిఐ ముందుకు వచ్చింది.