చైనాలో మరో విపత్తు..కూలిన కరోనా క్వారంటైన్ హోటల్..!

post

      కరోనా వైరస్ దెబ్బకి చైనా వాణిజ్య మార్కెట్ కుప్పకూలింది. కొన్ని వేలమంది కర్ఫ్యూ లో మగ్గుతున్నారు. ఎటువైపునుంచి కరోనా వ్యాపిస్తుందో తెలియక ఇళ్లకే పరిమితమయ్యారు. అంతకంతకూ పెరుగుతూ పోతున్న కరోనా కేసులను కట్టడి చేయలేక, కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం ఇప్పటికే అష్ట కష్టాలు పడుతోంది. కరోనా వైరస్ అనుమానితుల కోసం ప్రత్యేకం గా క్వారంటైన్లను ఏర్పాటు చేసింది. వారిని పదునాలుగురోజుల పాటు అబ్సర్వషన్ లో ఉంచి తిరిగి ఇళ్లకు పంపిస్తున్నారు.

     కరోనా దెబ్బకి జన జీవనం స్తంభించిపోయింది. కరోనా ని నిర్ములించడమే లక్ష్యం గా అక్కడి డాక్టర్లు, అధికారులు పని చేస్తున్న నేపధ్యం లో చైనా కు మరో కష్టం వచ్చింది. కరోనా బాధితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటైన్ హోటల్ కూలిపోయింది.  ఫూజియన్ ప్రావిన్స్ లోని క్వాంజౌ సిటీలో శనివారం సుమారు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతం లో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

     ఈ ఘటన వల్ల దాదాపుగా 70 మంది శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అంచనా. అధికారులు వెంటనే అప్రమత్తమై రక్షణ చర్యలు ప్రారంభించారు. సుమారు 34 మందిని కాపాడినట్లు తెలుస్తోంది. ఈ హోటల్ 2018 జూన్ లో ప్రారంభం అయింది. ఈ హోటల్లో  లో దాపు 80 గదులు ఉన్నాయి. ఉన్నట్టుండి కూలిపోవడానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే, ఇతర క్వారంటైన్లలో ఉన్న కరోనా బాధితులు భయాందోళనకు గురయ్యారు.