ట్రంప్ కు మోడీ రిప్లై.!

post

కరోనా కష్ట కాలం లో భారత్, అమెరికా దేశాలు సాయం అందించుకుంటూ పోరాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా భారత కు ఆర్థిక సాయం అందించింది. భారత్ కూడా అమెరికా కు మందుల సరఫరా లో సాయం అందించింది. తాజాగా... భారత్ లో వెంటిలేటర్ల కొరత ఏర్పడుతోంది. ఈ నేపధ్యం లో భారత్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెంటిలేటర్లు పంపి సాయం అందించిన సంగతి తెలిసిందే. అయితే... ఈ విషయమై  ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఆ పోస్ట్ కు భారత ప్రధాని మోడీ రిప్లై ఇచ్చారు. "భారత్ లో ఉన్న మా మిత్రులకు వెంటిలేటర్లు పంపిస్తున్నందుకు గర్విస్తున్నామంటూ" ట్రంప్ ట్వీట్ చేసారు. 
           అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఈ ట్వీట్ కు భారత్ ప్రధాని మోడీ స్పందించారు. వెంటిలేటర్లను అందించినందుకు ఈ సందర్భం గా మోడీ ప్రధాని కి కృతజ్ఞతలు తెలిపారు. "కరోనా మహమ్మారిపై అందరం సమష్టిగా యుద్ధం చేస్తున్నామని, విపత్కర పరిస్థితుల్లో దేశాలన్నీ కలసికట్టుగా పనిచేయడం ఎంతో కీలకమని వ్యాఖ్యానించారు. ప్రపంచ మానవాళి కరోనా నుంచి విముక్తం కావాలంటే దేశాలన్నీ శక్తివంచన లేకుండా శ్రమించాలని మోడీ పేర్కొన్నారు. భారత్, అమెరికా మైత్రి మరింత బలోపేతం కావాలని అభిలషిస్తున్నట్లు మోడీ తన ట్వీట్ ద్వారా తెలిపారు.