రైతులకు రుణ మాఫీ..!

post

తెలంగాణ లో మూడవరోజు అసెంబ్లీ కొనసాగుతోంది. ఈరోజు, మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసెంబ్లీ లో రైతుల రుణ మాఫి ప్రస్తావన వచ్చింది. ఈ నేపధ్యం లో తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రుణ మాఫీ ద్వారా రైతులపై బరువును తొలగించనున్నారు.

      బడ్జెట్ ప్రసంగం లో హరీష్ రావు రైతుల రుణ మాఫీ గురించి మాట్లాడారు. ఈ సందర్భం గా ఆయన 'ఈ నెల లోనే రైతుల రుణ మాఫీ ప్రక్రియను పూర్తి చేస్తామని తెలిపారు. పాతిక వేలనుంచి లక్ష వరకు ఉన్న రైతు రుణాలను నాలుగు దశలలో విడతలవారీగా మాఫీ చేస్తామని చెప్పుకొచ్చారు. అదే విధం గా, ఈ చెక్కులను రైతులకు స్థానిక ఎమ్మెల్యే లు అందచేస్తారని తెలిపారు. అలాగే, కందుల కొనుగోలు విషయం లో వెనుకాడబోమని, ఎంత ఖర్చు అవుతున్న సరే రైతుల వద్దనుంచి కందులు కొనుగోలు చేస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు.