ఢిల్లీ లో నాలుగోసారి భూకంపం..!

post

కరోనా మహమ్మారి తో దేశం లో అలజడి నెలకొంటే... మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ వరుస భూకంపాలతో సతమతమవుతోంది. గత ముప్పై రోజుల్లో ఇప్పటికి నాలుగు సార్లు ఢిల్లీ లో భూకంపం వచ్చింది. శుక్రవారం 2.2 మ్యాగ్నిట్యూడ్ తో తక్కువ తీవ్రతతో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 12 నుంచి ఇప్పటివరకు హస్తినలో నాలుగు సార్లు భూకంపం రావడం గమనార్హం. ఢిల్లీలో భూకంప కేంద్రం పితంపురాలో ఉంది. ఇవ్వాళ ఉదయం 11:28 గంటలకు ఎనిమిది కిలో మీటర్ల డెప్త్ తో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ తెలిపింది. మే పదవ తేదీన  మీడియం ఇంటెన్సిటీతో 3.4 మ్యాగ్నిట్యూడ్ తో వజీర్ పూర్ లో భూకంపం సంభవించింది. ఢిల్లీ కి చెందిన డిసాస్టర్ మేనేజ్మెంట్ అధారిటీ ప్రకారం... ఢిల్లీ–హర్ద్ వార్ రిడ్జ్ అని పిలిచే ఓ ప్రధాన భౌగోళిక నిర్మాణంతో ఢిల్లీలో భూకంపానికి సంబంధం ఉందని భావిస్తున్నారు.