అంతర్జాతీయ మహిళ దినోత్సవం..!

post

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.తాను గతంలో చెప్పినట్లుగానే సోషల్ మీడియాకు దూరమవుతున్నానని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా  తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తమ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురుకొని ప్రతిభామూర్తులుగా ఎదిగిన మహిళల జీవితగాధలు ప్రపంచంతో పంచుకుంటారని  ఆయన పేర్కొన్నారు. 
మొదటి మహిళ..! 
 మోదీ ట్విట్టర్ ఖాతా ద్వారా మొట్టమొదటిగా స్నేహ మోహన్‌దాస్ అనే మహిళ తన అనుభవాలను తెలియజేస్తూ ట్వీట్లు చేశారు. చెన్నైకి చెందిన స్నేహ అకలితో బాధపడుతున్నవారిని ఆదుకొనేందుకు ‘ఫుడ్‌ బ్యాంక్’ అనే సంస్థను స్థాపించారు. తన తల్లి ఎందరో కష్టాల్లో వున్నవారి ఆకలి తీర్చిందని తనకు ఆమే స్సూర్తి అని ఆమె తెలిపారు..ఆహారం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదని అది ఒక మార్పని, , పేదలకు బంగారు  భవిష్య్తత్తును ఇస్తుందని ఆమో అన్నారు.ప్రతి ఒక్కరు ఆకలి బాధతో ఉన్న ఒక వ్యక్తికి అయినా ఆహారాన్ని ఇచ్చి.. ఈ ప్రపంచంలో ఆకలి బాధ  అంటూ లేని విధంగా మార్చాలన్నారు. . సామూహిక వంటలు, వంటల మారథాన్లు, తల్లిపాలను పిల్లలకు ఇవ్వడం వల్ల కలిగే ఉపయోగాలు వంటి వాటి గురించి మేము ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని ఆమె ప్రధాని అకౌంట్ ద్వారా తన గురించి తెలియజేశారు. 

https://twitter.com/narendramodi/status/1236509753892671488