మహిళా అవార్డులు వీరికే..!

post

మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మహిళా అవార్డులకుగాను దాదాపు 20 రంగాలకు 30 మందిని ఎంపిక చేసింది. ఈ మేరకు మహిళా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య శనివారం రోజున ఉత్తర్వులను ఇచ్చారు. ఈ అవార్డులను ఆదివారం రోజు అందించనున్నారు.

గజ్జె కట్టిందంటే.. టైమే తెలీదు..!

 ప్రాచీన తెలంగాణ జానపడానికి నిలువెత్తు రూపమైన ఒగ్గుకథను 75 ఏళ్ల మల్లరి ఇప్పటికి పోషిస్తోంది. ఒగ్గుకథే ప్రాణం గా బతికేస్తున్న మల్లరిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా అవార్డుకు ఎంపిక చేసింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామానికి చెందిన మల్లరికి తండ్రి గుండాలు మరియు తల్లి చెన్నమ్మ. పుట్టినప్పుడే మల్లరి తండ్రి దేవుడి కి మొక్కుకోవడం తో మల్లరి ఒగ్గు కథకే అంకితమైంది. తండ్రి వద్ద నుంచి 11 వ ఏట ఒగ్గు కధ నేర్చుకుని  అప్పటినుంచి  కధలు చెప్తూ వస్తోంది. మల్లరి వేషం కట్టి కధలు ఆడితే, టైమే తెలీదని అక్కడి గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల వారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. 75 ఏళ్ల మల్లరి కళను బ్రతికించేటందుకు ఊపిరి ఉన్నంతవరకు గజ్జ కట్టి ఆడతానని చెపుతున్నారు. అవార్డు వచ్చినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరుతున్నారు.

రాష్ట్ర తొలి లేడీ కమర్షియల్‌‌‌‌ పైలెట్‌‌‌‌..!

ఓ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన సయ్యద్‌‌‌‌ సల్వా ఫాతిమా కష్టపడి చదువుకుని తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్నారు. సమస్యలను అధిగమించి పైలట్ అయ్యారు. దేశం మొత్తం లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ ను పొందిన గా నాలుగవ ముస్లిం గా ఫాతిమా నిలిచారు. ఫాతిమా తండ్రి చార్మినార్ వద్ద ఓ బేకరీ లో నౌకరు గా పనిచేస్తున్నారు. కష్టాల్లో ఉన్న ఫాతిమా, డిగ్రీ ని అంబెడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో పూర్తి చేసి 2007 పైలట్ శిక్షణ లో చేరారు. 2013 లో శిక్షణ పూర్తి చేసి, 2016 లో మల్టీ ఇంజిన్ టైపు రైటింగ్ కోర్సును పూర్తి చేసారు. కాగా, ఇందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 35 .50 లక్షలను అందించింది. 2016 చివర్లో ఎయిర్‌‌‌‌బస్‌‌‌‌ 320 టైప్‌‌‌‌ రేటింగ్‌‌‌‌ పూర్తి చేసి అధికారిక కమర్షియల్ లైసెన్స్ ను పొందారు. తెలంగాణ రాష్ట్రము లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగిన తొలి మహిళ గా గుర్తింపు పొందారు.

     వీరితో కలిపి, మొత్తం ముప్పై మంది మహిళలను వివిధ రంగాలనుంచి తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఎంపికైన వారిలో, పల్లెవాణి, మంగ్లీ సత్యవతి, నీరజ దేవి, లక్ష్మి రెడ్డి, శ్రీలక్ష్మి, ప్రొఫెసర్ సూర్య ధనంజయ, బోండా రామాలీల, మంజుల కళ్యాణ్, సరితా, స్రవంతి, దీక్షిత, నిర్మల రెడ్డి, శ్యామల గోలి, లక్ష్మమ్మ, గంగవ్వ,  డా.మంజుల రెడ్డి,  అనిత, శారద, కవిత, సౌజన్య, సంధ్య రాణి, యమునా బయి, మనీషా సాబు, మన్నే ఉషారాణి, డా అంజలి దేవి, డా అరుణ దేవి, సరోజ్ బజాజ్, మమతా రఘువీర్ ఉన్నారు.