ఎస్ బ్యాంకు వ్యవస్తాపకుడు అరెస్ట్..!

post

మనీలాండరింగ్ కేసులో ఎస్ బ్యాంకు వ్యవస్థాపకుడు రానాకపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.ఈ నెల 6న  ముంబై వోర్లి ప్రాంతంలోని 'సముద్ర మహల్' కాంప్లెక్స్‍లోని రానా నివాసంలో ఈడీ అధికారులు సాదాలు జరిపి, పీఎంఎల్ఏ కింద కేసు నమోదుచేశారు. నిభందనలకు విరుద్దంగా  డీహెచ్ఎఫ్ఎల్‌కు రానాకపూర్‌ రుణాలు ఇచ్చారని, అవి నిరర్ధక ఆస్తులగా మారాయన్నది ఈడీ ఆరోపణ. ఉత్తరప్రదేశ్ పవర్ కార్పొరేషన్‌లో పీఎఫ్ అవకతలకు పాల్పడినట్లు కూడ రానాకపూర్  పై అభియోగాలున్నాయి.
బంధువు ఇళ్లపై దాడి..! 
రానాకపూర్ పై అభియోగాల కు సంబంధించి ఆధారారల సేకరణకు ఈడీ బృందాలు ఆయన బంధువులు, కుమార్తెల ఇళ్లలో సోదాలను నిర్వహించినట్లు తెలుస్తోంది ఆర్బీఐ డ్రాఫ్ట్ రీకన్‌స్ట్రక్షన్ స్కీమ్ ప్రకారం, ప్రభుత్వ ఆమోదిత బెయిలవుట్ ప్లాన్ కింద సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంకులో 49 శాతం వాటాలను ఎస్‌బీఐ తీసుకోనుంది.