అశ్వత్ధామ వచ్చేసాడు..!

post

యంగ్ హీరో నాగ శౌర్య కెరీర్ మొదటి నుంచే విభిన్నమైన కధలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఇప్పటి దాక రొమాంటిక్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న నాగ శౌర్య మొదటి సారి యాక్షన్ థ్రిల్లర్ తో మాస్ హీరో గా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ గా ప్రమోషన్స్ చేసాడు. ఎట్టకేలకు నేడు ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. కొంతవరకు నాగ శౌర్య శ్రమ ఫలించిందని చెప్పాలి. అమ్మాయిలపై జరుగుతున్న అరాచకాలను హీరో ఎలా ఎదుర్కొంటాడు అనే కధనం చుట్టూ ఈ సినిమా ఆసక్తికరం సాగింది. ఫస్ట్ హాఫ్ వరకు హీరో ఛేజింగ్ సీన్స్ తో ఆకట్టుకుంది. ఆ తరువాత నుంచి కధ సాగుతున్నట్లు అనిపిస్తుంది. ప్రతి నాయకుడి పాత్రను ఆసక్తికరం గా తెరకెక్కించారు. కాకపోతే, ఫస్ట్ హాఫ్ లోనే విలన్ ఎవరో తెలిసిపోవడం వల్ల ఆ తర్వాత కధ బోరింగ్ గా సాగుతుంది. నాగ శౌర్య నటన కు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ మెహ్రీన్ కూడా ఆకట్టుకుంటుంది. నాగ శౌర్య చెల్లెలి పాత్రలో నటించిన అమ్మాయి నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. మిగిలిన వారంతా తమ పరిధి మేర నటించారు.