మారుతీరావు ఆత్మహత్య..!

post

అమృత తండ్రి, ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతి రావు హైదరాబాదు లో ఆత్మహత్య చేసుకున్నారు. ఖైరతాబాద్ లోని ఆర్య వైశ్య భవన్ లో బస చేసిన మారుతీ రావు విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. శనివారం రాత్రి భార్య ఎన్ని సార్లు ఫోన్ చేసిన స్విచ్ ఆఫ్ రావడం తో ఆమె అనుమానం తో ఆర్య వైశ్య సిబ్బంది ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది. సాధారణం గా మారుతీ రావు ఎప్పుడు ఫోన్ ను స్విచ్ ఆఫ్ కాకుండా చూసుకుంటారు. అలాంటిది, ఎన్ని సార్లు చేసిన స్విచ్ ఆఫ్ రావడం తో ఆమెకు అనుమానం వచ్చింది.

కూతురు ప్రేమను ఒప్పుకోలేక..

      రియల్ ఎస్టేట్ వ్యాపారం లో కోట్లకు పడగలెత్తిన మారుతీ రావు తన కూతురు అమృత..ప్రణయ్ ను ప్రేమించడానికి ఒప్పుకోలేదు. తన ఇష్టం లేకుండా ప్రణయ్ ను పెళ్లి చేసుకుందన్న కారణం తో..తన కూతురు గర్భవతి అని కూడా చూడకుండా ప్రణయ్ ను హత్య చేసాడు. కక్ష తో పరువు హత్య కు పాల్పడ్డాడు. ఈ కేసు లో మారుతి రావు జైలు పాలయ్యాడు. పీడీ ఆక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇదంతా గతం. కాగా, అమృత కుమారుణ్ణి ప్రసవించింది. ఆరు నెలల కిందట, మారుతి రావు బెయిల్ పై విడుదల అయ్యాడు. అప్పటినుంచి అమృత తో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు అనుకూలం గా సాక్ష్యం చెబితే ఆస్తి మొత్తం తన పేరు మీద రాసి ఇస్తాను అని చెప్పినట్లు సమాచారం.

'తల్లి..అమృతా..అమ్మ దగ్గరకి వెళ్ళిపో..!

      ఆత్మహత్య చేసుకున్న ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు గదిలో ఓ సూసైడ్ నోట్ కనిపించింది. అందులో ఆయన "తల్లి..అమృతా..అమ్మ దగ్గరకి వెళ్ళిపో.." అని పేర్కొన్నారు. కాగా, ఆయన భౌతిక దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు. సూసైడ్ నోట్ తో పాటుగా, ఆయన ఫోన్ మరియు సూట్కేసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

హత్య తరువాత టచ్ లో లేరు..!

      తండ్రి మారుతీ రావు ఆత్మహత్య పై, అమృత స్పందించారు. మీడియా లో చూసే వరకు తనకు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలియదని అన్నారు. ప్రణయ్ ను హత్య చేసిన తరువాత నుంచి ఆయనతో తాను టచ్ లో లేనని తెలిపారు.