నిఘా యాప్ తో అక్రమాలకు చెక్..!

post

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీతో పాటు ఇతర ప్రలోభాలు ఏమీ వుండకూడదని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే స్సష్టం చేసారు.ఇపుడు సాంకేతికంగా వీటిని అడ్డుకునేందుకు, సామాన్యులు కూడ వీటిపై ఫిర్యాదు చేసేందుకు  అడ్డుకట్ట వే నిఘా యాప్‌ రూపకల్పన చేసింది.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తాడేపల్లిలోని తన నివాసంలో నిఘా యాప్‌ను ఆవిష్కరించారు. . ఎన్నికల సంరూపొందించింది. ఎవరైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి పాల్పడుతున్న వారి వివరాలతో పాటు చట్ట వ్యతిరేకంగా తమ దృష్టికి వచ్చిన ఏ అంశంపైనా ఫిర్యాదు చేసే వెసులుబాటు ఉంది. యాప్‌ ద్వారా చేసే ఫిర్యాదులు నేరుగా సెంట్రల్‌ కంట్రోల్‌ రూంకు చేరుతాయి. అక్కడ నుంచి సంబంధిత అధికారులు దానిపై చర్యలు తీసుకుంటారు