జీతం కట్ చేసిందని పెట్రోల్ దాడి..!

post

గత ఏడాది హైదరాబాద్ లో మహిళా తహశీల్దార్ పై  ఒక వ్యక్తి పెట్రోలుతో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇపుడు ఇంచుమించగా విశాఖపట్నం లో కూడ అదే తరహా సంఘటన చోటు చేసుకుంది. తన జీతం కట్ చేసిందన్న కోపంతో ఒక మహిళా అధికారిపై కింది స్దాయి ఉద్యోగిని పెట్రోలు తో దాడి చేయడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకున్నారు.

       విశాఖ పట్నం జీవీఎంసీలోఅన్నామణి అనే మహిళ  శానిటరీ సూపర్ వైజర్ గా పని చేస్తోంది. ఆమె  20 రోజులు డ్యూటీకి రాకపోవడంతో ఏఎంహెచ్ వో లక్ష్మీతులసి ఆమె జీతం కట్ చేసింది.దీనితో శనివారం  ఆఫీసుకు వెళ్లిన అన్నామణి  ఏఎంహెచ్ వో తో గొడవకు దిగి తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ బాటిల్ బయటకు తీసింది. అయితే అందులో పెట్రోల్ ను లక్ష్మీతులసిపై చల్లడానికి ప్రయత్నించగా ఆమె తప్పించుకోవడంతో ప్రమాదం తప్పింది.  తనపై  కక్ష కట్టిన అన్నామణి దాడికి యత్నించిందని లక్ష్మీతులసి ఆరోపించింది.  దీనిపై పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.