ఖుష్బూ కి డాక్టరేట్..!

post

సినీ ప్రేమికుల్లో ఖుష్బూ పేరు తెలియని వారుండరు. తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో అనేక పాత్రలను పోషించింది. ఆమె అందం, నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆమె దాదాపు గా ఇరవై ఏళ్ల నుంచి ఆమె నటనతో ఆకట్టుకుంటున్నారు. తెలుగులో అజ్ఞాతవాసి తరువాత ఆమె ఏ చిత్రం లోను నటించలేదు.

          అందానికి, అభినయనానికి కేరాఫ్ అడ్రెస్స్ అయిన ఖుష్భు ప్రస్తుతం అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కర్తగా విధులను నిర్వహిస్తున్నారు. తాజాగా, ఆమె అమెరికా లోని ప్రపంచ తమిళ విశ్వ విద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ ను అందుకున్నారు. ఈ విషయాన్నీ ఆమె స్వయం గా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఖుష్బూ వెంకటేష్ నటించిన 'కలియుగ పాండవులు' చిత్రం ద్వారా వెండితెర కు పరిచయం అయ్యారు. రజినీకాంత్, కమల్‌ హాసన్‌, చిరంజీవి, నాగార్జున వంటి అందరు స్టార్ నటులతోను నటించారు. ప్రస్తుతం ఆమె సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఉన్నారు.