మందు అనుకుని రసాయనం తాగేశారు..!

post

 ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం లో ఈ విషాదం జరిగింది. ముగ్గురు మత్స్య కారులు మద్యం అనుకుని ఓ రసాయనం ఉన్న బాటిల్ ను తాగేశారు. దీనితో వారిలో ఇద్దరు మృతి చెందారు. మరొకరు ప్రస్తుతం విషమ పరిస్థితి లో ఉన్నారు. వీరు ముగ్గురు రెండు రోజుల క్రితం సముద్రం లో చేపలు పట్టడానికి వెళ్లారు. అయితే, వీరు వెళుతున్న పడవకు దగ్గరగా ఓ సీసా తేలియాడుతూ కనపడటం తో పడవలోంచి దానిని అందుకున్నారు. అందులో ఉన్న ద్రవపదార్ధాన్ని చూసి, మద్యం అనుకుని ముగ్గురు సేవించారు. వెంటనే వారు తీవ్ర అస్వస్థత కు గురయ్యారు. దీనితో, పక్కన ఉన్న ఇతర మత్స్యకారులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరు మృతి చెందగా, ఒకరు చికిత్స పొందుతున్నారు. ఆ సీసా లో ఉన్న రసాయనం తాగడం వల్లే వారిద్దరూ మరణించి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.