చెన్నకేశవులు భార్యకు సాయం చేయండి : వర్మ

post

తెలంగాణ లో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశా ఘటన దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఐతే, హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసిన ఎన్కౌంటర్ లో నిందితులు ఘటనా స్థలం లోనే మృతి చెందారు. కాగా, నిందితులలో ఒకరైన చెన్నకేశవులు భార్య రేణుక అప్పటికే గర్భం దాల్చి ఉంది. తనకు అన్యాయం జరిగిందని ఆమె మీడియా ముందుకి వచ్చి వాపోయింది. 

         ప్రస్తుతం, చెన్నకేశవులు భార్య రేణుక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం రేణుక తన కుటుంబ సభ్యులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రి కి ప్రసవం కోసం వచ్చింది. శుక్రవారం తాను ఆడబిడ్డను ప్రసవించింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమం గానే ఉన్నారు.

        దీనిపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'చెన్నకేశవులు భార్య రేణుక ఆడపిల్లకు జన్మనిచ్చిందని.. ఇద్దరూ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. వీరికి ఎవరైనా దాతలు ఎవరైనా సాయం చేయాలనీ కోరారు.' తాను పోస్ట్ చేసిన ట్వీట్ లోనే అకౌంట్ నెంబర్ ను, ఐఎఫ్ఎస్సి కోడ్ ను జత చేసారు.