ఏపీలో మారిన పదో తరగతి పరీక్ష షెడ్యూల్..!

post

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా.. 10వ తరగతి పరీక్ష తేదీల్లో మార్పులు చేశారు. మార్చి 31 నుంచి ఏప్రిల్ 17 వరకు పరీక్షలు జరగనున్న కొత్త షెడ్యూల్‌ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈనెల 23వ తేదీ నుంచి జరగాల్సిన టెన్త్‌ పరీక్షలు 31వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఆ మేరకు పరీక్షలను రీ షెడ్యూల్‌ చేశారు.