తాజ్ మహల్ మూసేయండి..!

post

తాజ్ మహల్ ను మూసివేయాలంటూ ఆగ్రా మేయర్  కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసారు. తాజ్ మహల్ నే కాకుండా అన్ని ఇతర పురాతన కట్టడాలను, పర్యాటక కేంద్రాలను ప్రస్తుతానికి మూసివేయాలని ఆయన మోడీ ప్రభుత్వాన్ని కోరారు. ఓ వైపు కరోనా వైరస్ విస్తరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో పర్యాటకులు దేశ విదేశాల్లో తిరగడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి మరింత పెరుగుతోంది. అందుకోసం, కొంతకాలం తాజ్ మహల్ ను మూసి వేయాలని మేయరు లేఖ ద్వారా కోరారు.

  '‘‘తాజ్‌మహల్‌‌ను చూసేందుకు స్వదేశీలతో పాటు విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఆగ్రా నగరానికి వస్తున్నారు..దీంతో ఆగ్రా నగరంలో కరోనావైరస్ వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. కరోనా వైరస్ అదుపులోకి వచ్చే వరకూ తాజ్‌మహల్‌‌తోపాటు ఫతేపూర్ సిక్రీ కోట, ఆగ్రాలోని కోట, ఇతర పురాతన కట్టడాలను మూసివేయాలని పర్యాటకులు రాకుండా చర్యలు తీసుకోవాలి’’ మేయరు, నవీన్ జైన్.

   ఇప్పటికే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి ని నివారించడానికి చాల పటిష్టమైన చర్యలు తీసుకుంది. 2,915 మంది విదేశీ పర్యాటకులు తాజ్ మహల్ ను చూడటానికి విచ్చేయగా, వారందరికీ ప్రభుత్వం వైద్య పరీక్షలు నిర్వహించింది. వీరిలో దాదాపు 705 మంది దాకా ఐసొలేషన్ హోమ్ లో ఉన్నారు. కాగా, ముగ్గురు విదేశీయులకు కరోనా వైరస్ లక్షణాలు ఉండటం తో వారిని ఆసుపత్రి లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు.