పెన్షనర్లకు కేంద్రం శుభవార్త..!

post

పెన్షన్ తీసుకునే వారు ప్రతి ఏడాది బ్యాంకులకు లైఫ్ సర్టిఫికెట్ లు సమర్పించాల్సి ఉంటుంది. ముదుసలి వయసులో బ్యాంకులకు వచ్చి లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడం కొంత కష్టతరమే అయినా తప్పని సరి గా సమర్పించాల్సిందే. అలా ఇవ్వని పక్షం లో పెన్షన్ అందదు. వీరికి కేంద్రం శుభవార్త అందించింది. ఇకనుంచి వీరు బ్యాంకులకు వచ్చి వేచి ఉండాల్సిన పని లేదు. బ్యాంకు అధికారులే ఇళ్లకు వచ్చి పెన్షన్ అందించనున్నారు. ప్రతి ఏడాది అక్టోబ‌ర్ 24, న‌వంబ‌ర్ 1, 15, 25 తేదీల్లో ఇంటికి వచ్చి సర్టిఫికెట్ తీసుకోవాలా వద్దా? అని ఒక మెసేజ్ అందరి పెన్షనర్లకు వెళుతుంది. పెన్షన్ తీసుకునే వ్యక్తి అంగీకారం తెలిపితే, బ్యాంకులే అతని వద్దకు వెళ్లి లైఫ్ సర్టిఫికెట్ తీసుకుని పెన్షన్ అందచేస్తాయి. ఈ సేవలకు గాను గరిష్టం గా అరవై రూపాయలు వసూలు చేస్తారు.