అవినీతి బాబులకు నో పాస్ పోర్ట్ ..!

post

అవినీతి కేసులు నమోదయిన, లేదా ఆయా కేసుల్లో ప్రాసిక్యూషన్  ఎదుర్కొనే ప్రభుత్వ ఉద్యోగులకు పాస్ పోర్ట్ ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయించింది. పెంట్రల్ విజిలెన్స్ కమీషన్, విదేశాంగ శాఖల నిభందనలను పర్సనల్ మినిస్ట్రీ రివ్యూ చేసిన తరువాత  ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    ఆయా ఉద్యోగులకు విజిలెన్స్ కమీషన్ క్లియరన్ష్ ఇచ్చిన తరువాత కూడ వారిపై వారికి పాస్ పోర్టులు ఇచ్చే నిర్ణయాన్ని సంబంధిత అధారిటీ అవినీతి నిరోధక చట్టం కింద నిలుపు చేయడానికి అధికారం వుందని అధికారులు తెలిపారు. పాస్ పోర్ట్ యాక్ట్ 1967, 6(2) కింద  ఉద్యోగులు పాస్ పోర్టు పొందిన ఉద్యోగులు విషయమై చెక్ చేయాలని అన్ని శాఖలను ఆదేశించారు.