బాంబు తయారీ వస్తువులను అమెజాన్ లో కొన్నాం..!

post

గతేడాది ఫిబ్రవరి లో జరిగిన పుల్వామా దాడిని భారతీయులు ఎప్పటికి మర్చిపోలేరు. అది భారత చరిత్రలో ఓ మారణకాండ. అది సైనిక కుటుంబాలకు తీరని లోటుని మిగిల్చింది. ఈ దుర్ఘటన జరిగి ఏడాది కావొస్తున్నా ఇప్పటికి భారత పౌరుల్లో రక్తం మరుగుతూనే ఉంటుంది. పుల్వామాలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) యొక్క కాన్వాయ్‌పై జరిగిన దాడి లో దాదాపు నలభై మంది సీఆర్పీఎఫ్ జవానులు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తరువాత రెట్టింపు స్థాయి లో భారత జవాన్లు పాకిస్తాన్ పై తిరగబడిన సంగతి తెలిసిందే.

          ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుల్లో ముగ్గురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసారు. తాజాగా, శ్రీనగర్‌కు చెందిన వైజ్-ఉల్-ఇస్లాం, పుల్వామాకు చెందిన మహ్మద్ అబ్బాస్ రాథర్‌లను పోలీసులు అరెస్టు చేసారు. వీరితో కలిపి నిందితుల సంఖ్య ఐదు కు చేరుకుంది. కాగా, విచారణ లో వీరు చెప్పిన నిజాలకు పోలీసులు ఆశ్చర్యపోయారు. బాంబులు తయారు చేసే వస్తువులను తాము అమెజాన్ నుంచి విక్రయించాం అని తెలిపారు.

          జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదుల ఆదేశాలను అనుసరించి ఐఇడిలు, బ్యాటరీలు మరియు ఇతర వస్తువులను సొంతం గా తయారు చేయడానికి కావలసిన రసాయనాలను అమెజాన్ షాపింగ్ ఖాతా ద్వారా కొనుగోలు చేశామని నిందితుడు ఇస్లాం తెలిపాడు అని ఎన్ఐఏ అధికారి తెలిపారు. నేడు (శనివారం) ఈ నిందితులను జమ్మూలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు.