పిడుగుపాటు తో నెల్లూరు లో 5 గురు మృతి..!

post

అసలే కరోనా మహమ్మారి తో దేశం అల్లకల్లోలం గా ఉంది. మరోవైపు ఇపుడు ప్రకృతి కూడా తన ప్రతాపాన్ని  చూపిస్తోంది. తెలుగురాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు కరోనా వైరస్ నిద్ర పోనీకుండా చేస్తుంటే, మరోవైపు అకాల వర్షపు పిడుగులు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. తాజాగా, నెల్లూరు లో ఉరుములు, పిడుగులతో కూడిన అకాల వర్షం కురిసింది. పిడుగుపాట్ల వల్ల నెల్లూరు జిల్లాలో ఐదుగురు మృతి  చెందారు. దగదర్తి మండలం చెన్నూరులో పిడుగుపడి ముగ్గురు గొర్రెల కాపరులు మరియు పెంచల రెడ్డి, సుబ్బారావు అనే వ్యక్తులు కూడా పిడుగుపాటు కారణం గా మృతి చెందారు. మెరుపులతో బీభత్సంగా వర్షం పడటంతో పంటలు కూడా నష్టపోయాయి. అసలే కరోనా కారణంగా గిట్టుబాటు ధరలు రాక రైతులు అల్లాడుతుంటే, మరో వైపు అకాల వర్షం తమ పొట్ట కొట్టిందని రైతులు వాపోతున్నారు.