పంటంతా నీటి పాలు..!

post

తెలంగాణ ప్రాంతాలల్లో అకాల వర్షం కురిసింది. ఈ వర్షం రైతులకు నష్టాన్ని  కలిగించింది. వరి, మొక్కజొన్న పంటలు ఇప్పటికే  కొత్త కు సిద్ధమయ్యాయి. కాగా, వర్షం కారణం గా ఇవి తడిసి ముద్దయ్యాయి. ఈదురుగాలుల వల్ల అరటి, మామిడి కాయలు కూడా పండకుండానే రాలి పోయాయి.  పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జంగారెడ్డి గూడెం, కొయ్యలగూడెం, బుట్టాయగూడెం తదితర మండలాల్లో తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబెట్టిన వరి, మొక్కజొన్నలు తడిసి పోయాయి. కోతకు వచ్చిన పంట నేల రాలడం తో రైతులు బావురుమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.