జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు..!

post

4జీ సేవల పునరుద్ధరణ గురించి ఈరోజు సుప్రీం కోర్టు జమ్మూ కాశ్మిర్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది. ఆర్టికల్ 370 ని రద్దు చేసాక అక్కడ ఇంటర్నెట్ సర్వీసులు రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే, ఇక్కడ ఇంటర్నెట్ సర్వీసులను పునరుద్ధరించాలంటూ ఫౌండేషన్ ఫర్ మీడియా ప్రొఫెషనల్స్ అనే ఎన్జీవో సంస్థ గతం లో పిటిషన్ దాఖలు చేసింది. అయితే, ఈ పిటిషన్ పై సమాధానం చెప్పాలని సుప్రీం కోర్ట్ జమ్మూ కాశ్మిర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపు లాయర్ హుజెఫా అహ్మది తన వాదనలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపించారు. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌ను 4జీ నెట్‌వర్క్‌తో అనుసంధానం చేయడం అత్యవసరమని ఆయన వాదించారు. ఈ సర్వీసు అందుబాటులో ఉంటేనే  విద్యార్ధులకు వర్చువల్ క్లాసులు నిర్వహణ, మంచి కనెక్టివిటీ కి అవకాశం ఉంటుందని ఆయన విన్నవించారు.