స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ విడుదల..!

post

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్. రమేశ్ కుమార్ తెలిపారు. మొదటి దశలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. రెండో దశలో పంచాయతీ ఎన్నికలు, మూడో దశలో మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.