ప్రారంభమైన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం..!

post

ఈరోజు మధ్యాహ్నం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభమైంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పొలిట్‌బ్యూరో సభ్యులు, టీడీపీ  అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో కరోనా వైరస్‌, బాధితుల ఆందోళన, వైద్యుల ఇక్కట్లపై వీరు చర్చించుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడం ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడాన్నికూడా సమావేశం లోని సభ్యులు చర్చించారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఎల్‌ రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, గల్లా జయదేవ్‌, గల్లా అరుణ, లోకేష్‌ చినరాజప్ప, కళా వెంకట్రావు, వర్లరామయ్య, అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాస్ తదితరులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.