తెలంగాణలో ఉమ్మివేయడం నిషేధం..!

post

కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణ కై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా,పబ్లిక్ ప్రదేశాల్లో ఉమ్మివేయడం పై నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి తెస్తూ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. అనారోగ్య అలవాట్ల వలన కరోనా లాంటి వైరస్ లు సోకె ప్రమాదం ఉందని, అందుకే ఈ నిషేధాన్ని తీసుకొచ్చినట్లు తెలిపింది.