రామ్ మందిరం ట్రస్టు లోగో విడుదల..!

post

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తరువాత అందుకోసం ప్రత్యేకం గా ట్రస్టు ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ ట్రస్ట్ కు లోగోను నిర్ణయించి ఈరోజు బుధవారం హనుమాన్ జయంతి సందర్భంగా విడుదల చేసారు. ఈ ట్రస్ట్ లోగో ను  ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ విడుదల చేసారు. చుట్టూ సూర్యుడు ప్రకాశిస్తుండగా మధ్యలో రాముడు ఉన్నట్లుగా ఈ లోగో ఉంటుంది. లోగో మధ్యలో "రామో విగ్రహవాన్ ధర్మః"  అని సంస్కృతంలో రాశారు. ఎరుపు, పసుపు, కాశాయ రంగులతో లోగోను డిజైన్ చేశారు. శ్రీ రామ చంద్రుడు, హనుమంతుడు ఎల్లప్పుడూ భారత్ ను కాపాడతారని రాయ్ అన్నారు.