ట్విట్టర్ సీఈఓ బిలియన్ డాలర్ల సాయం..!

post

కరోనా మహమ్మారి పై ప్రపంచ దేశాలు పోరాటం చేస్తున్నాయి. అయితే, వీటి కోసం ట్విట్ట‌ర్ సీఈవో డోర్సీ భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇందుకోసం ఆయన బిలియ‌న్ డాల‌ర్ల‌ను ఇస్తున్న‌ట్లు ప‌ర్స‌న‌ల్ ట్విట్ట‌ర్ ద్వారా చెప్పారు. ఆయనకు పర్సనల్ గా ఆన్లైన్ సంస్థ స్కేర్ ద్వారా మొత్తం సంప‌ద‌లో 28 శాతం ఆర్థిక సాయంగా ఇస్తున్న‌ట్లు చెప్పారు. అలానే, ఆయన స్టార్ట్ స్మాల్ కు అందిన డ‌బ్బు ఏ సేవా సంస్థ‌ల‌కు ఎంత మొత్తంలో అందుతుందో తెలిసే విధంగా ఒక లింక్ ను కూడా పోస్ట్ చేశారు. స్క్వేర్ లో ఎక్కువ వాటా ఉందని, అందుకే ట్విట్టర్ నుంచి కాకుండా స్క్వేర్  నుంచి విరాళమిస్తున్నట్లు ఆయన తెలిపారు.