ఆర్థిక ప్యాకేజీ మరోసారి..?

post

దేశం లో లాక్ డౌన్ విధించడం తో ఆర్థిక రంగం ఇప్పటికే గాడి తప్పింది. దీనిని సరిదిద్దడానికి, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,70000 కోట్లతో ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించింది. బ్యాంకింగ్, ఈఎంఐ ల వ్యవహారాల్లో కూడా అనుకూల మార్పులు చేర్పులు చేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్దీపన ప్యాకేజీ ని ప్రకటించబోతోందని సమాచారం. ఇప్పటికే, మరోసారి ప్యాకేజీ అందించడానికి అన్ని మంత్రిత్వ శాఖలతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఏ ఏ రంగాలకు ఎంత మొత్తం లో ఉద్దీపనను అందించాలన్నదానిపై ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.