సీఎం లతో పీఎం వీడియో కాన్ఫరెన్స్..!

post

కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపధ్యం లో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఈ లాక్ డౌన్ ముగియనుంది. ఈ నేపధ్యం లో ఏప్రిల్  11 వ తేదీన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీ కానున్నారు. ఇప్పటికే దేశం లో పలు ప్రాంతాల్లో కరోనా వైరస్ రెండో దశను కూడా దాటిందని ఎయిమ్స్ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సందర్భం లో పీఎం అందరు ముఖ్యమంత్రులతో చర్చించబోతున్నారు.