కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్..!

post

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం బీజేపీ ఎంపీలతో పాటు ఆమ్‌ఆద్మీ రాజ్యసభ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భం గా, ఆయన "ఇది మనమందరం కలిసి పోరాడాల్సిన సమయం"అని  గుర్తు చేసారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ పై అరవింద్ కేజ్రీవాల్ ఓ ట్వీట్ చేసారు. "ఈ వీడియో భేటీ లో కరోనా వ్యాప్తి గురించి చర్చించామని, కొందరు ఎంపీ లో అద్భుతమైన సలహాలను ఇచ్చారని, వాటిని వీలైనంత తొందర లోనే అమలులోకి తెస్తామని" ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఢిల్లీ లో 576 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, తాజాగా 51 కేసులు నమోదు అయ్యాయని ఢిల్లీ అధికారులు చెబుతున్నారు. ఈ తరుణం లో ఢిల్లీ ముఖ్యమంత్రి అందరు ఎంపీ లు, కార్యకర్తలతో వీడియో సమావేశం నిర్వహించి అందరి సలహాలు తీసుకున్నారు.