భారత్ లో ఒక్కరోజు లో 773 కేసులు..!

post

భారత్ లో కూడా కేసుల సంఖ్యా వేగంగా విస్తరిస్తోంది. 24 గంటల్లో కొత్తగా 773 మందికి కోవిడ్‌-19 సోకినట్లు నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 32 మంది మృత్యువాత పడ్డారు. నేటితో భారత్ లో కేసుల సంఖ్యా 5,194 కు చేరుకుంది. ఈ విషయాన్నీ కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా, వీరిలో 402 మంది ఇప్పటికే కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ఆయన తెలిపారు. మొత్తం భారత్ లో ఇప్పటిదాకా  149 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. కరోనా సోకిన ప్రాంతాల్లో పర్యవేక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని, అందరు తప్పనిసరిగా సామజిక దూరాన్ని పాటించాలని ఆయన కోరారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ల కొరత పై సందేహాలు అవసరం లేదని, ఇప్పుడు గాని భవిష్యత్ లో గాని వీటి కొరత రాదనీ, భారత్ కు సరిపడా నిల్వలు ఉన్నాయని అగర్వాల్ చెప్పుకొచ్చారు.