బ్లాక్ ఫ్రైడే..!

post

కరోనా వైరస్ , యెస్ బ్యాంక్ సంక్షోభంతో శుక్రవారం మార్కెట్లో రూ.ఐదు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.  సెన్సెక్స్‌1500 పాయింట్లు కుప్పకూలగా, నిఫ్టీ 400 పాయింట్లు పతనమైంది. అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. దీంతో కీలక సూచీలు రెండూ ప్రధాన మద్దతు స్థాయిలను కోల్పోయాయి. ప్రస్తుతం కోలుకున్నప్పటికీ సెన్సెక్స్‌ 38 వేలకు దిగువన, నిఫ్టీ 11వేలకు దిగువన కొనసాగుతున్నాయి. బ్యాంకు నిఫ్టీ 1300 పాయింట్లు కుప్పకూలింది.  యస్‌బ్యాంకు 25 శాతం,ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌  11,ఎస్‌బీఐ 8శాతం, ఐసీఐసీఐ, యాక్సెస్‌ బ్యాంక్‌లు 4శాతం పతనమయ్యాయి.యెస్‌బ్యాంక్‌ బోర్డును 30 రోజుల పాటు తమ అదపులు ఉంచుకోనున్నట్లు ఆర్‌బీఐ నిన్న ప్రకటించడం,విత్‌డ్రా పరిమితి రూ.50వేలుగా నిర్ణయించడం మార్కెట్లలో భయాన్ని రేకెత్తించాయి.  మరో పక్క అంతర్జాతీయ మార్కెట్లు కూడ భారీగా పతనమయ్యాయి. జపాన్‌ మార్కెట్లు 3శాతం కుంగగా.. చైనా మార్కెట్లు 1శాతం వరకు పడ్డాయి.  అమెరికా మార్కెట్లు  భారీగా నష్టపోయాయి.కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయని విశ్లేషణలు మార్కెట్లను బలహీనపర్చాయి.