ప్రాణాలే ముఖ్యం..: హరీష్ రావు

post

కరోనా మహమ్మారి లాక్ డౌన్ విషయమై మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని ఆయన చెప్పుకొచ్చారు. రాష్ట్రము లో లాక్ డౌన్ పొడిగించైనాయే సరే సహకరించాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. కేవలం సామాజిక దూరం మాత్రమే కరోనా ను అరికడుతుంది ఆయన చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ ను పూర్తి గా ఎత్తివేసే వరకు ఎవరు ఇళ్లనుంచి బయటకు రావొద్దని, కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తోందని ఆయన చెప్పుకొచ్చారు. అమెరికా, ఇటలీ లాంటి దేశాల్లో తలెత్తిన పరిస్థితి ఇక్కడ తలెత్తకూడదంటే, సామాజిక దూరాన్ని తప్పని సరిగా పాటించాల్సిందేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అది ఒక్కటే మన ముందున్న మార్గమని మంత్రి హరీష్ రావు అన్నారు.