ఏప్రిల్ 30 వరకు బుకింగ్ రద్దు : ఐఆర్‌సీటీసీ

post

కరోనా మహమ్మారి కారణం గా దేశవ్యాప్తం గా రవాణా బంద్ అయినా సంగతి తెలిసిందే. ఈ నేపధ్యం లో ఐఆర్‌సీటీసీ కూడా ట్రైన్ బుకింగ్ ను రద్దు చేసింది. అయితే, ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగుతుంది కాబట్టి అప్పటివరకు టికెట్ బుకింగ్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. తాజా గా, ఐఆర్‌సీటీసీ తన ఆధ్వర్యంలో నడుస్తోన్న మూడు ప్రయివేట్ రైళ్ల బుకింగ్‌లను ఏప్రిల్ 30 వరకు రద్దు చేసింది. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ తేజస్ రైళ్ల పేరిట ఢిల్లీ-లక్నరైలు మార్గం, అహ్మదాబాద్- ముంబై  రైలు మార్గం,  కాశీ మహాకాళ్ రైలు మార్గాలను నడుపుతున్న సంగతి తెల్సిందే. అయితే, ఈ ట్రైన్స్ కు ఏప్రిల్ 30 వరకు బుకింగ్ రద్దు చేసింది. మరో వైపు దేశం లో లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపించడం తో, మిగిలిన రైళ్ల బుకింగ్స్ కూడా రద్దు కావచ్చని భావిస్తున్నారు. రైల్వే శాఖ ఆధ్వర్యం లో నడిచే రైళ్లకు కూడా బుకింగ్ రద్దు అయ్యే చాన్సు ఉంది. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత కూడా, రైళ్లను పునరుద్దరించే అవకాశాలు కనిపించడం లేదు.