ఏపీ లో పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్...!

post

కరోనా లాక్ డౌన్ కారణం గా పదవ తరగతి పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటికే మూడు సార్లు ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే, వీటి కారణం గా విద్యార్థులు సబ్జెక్టు ను పక్కన పెట్టేసే ఛాన్స్ ఉంది. అందుకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం నుంచి విద్యార్థుల కోసం ఆన్‌లైన్ పాఠాలు ప్రారంభించింది. దూరదర్శన్ సప్తగిరి ఛానల్‌ లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు.. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి క్లాసులు ప్రత్యక్ష ప్రసారం చేస్తన్నారు.
 అయితే, ఈ క్లాసులకు విద్యార్థులు తప్పని సరిగా హాజరు కావాలని ప్రభుత్వం సూచిస్తోంది.  గ్రామ సచివాలయ సిబ్బంది విద్యా శాఖకు విద్యార్థులు హాజరుపై సమాచారం అందిస్తారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులు ఈ క్లాసులకు హాజరు అయ్యేట్లు చూస్తారు. లాక్ డౌన్ దెబ్బకి పాఠశాలలు మూత పడటం తో, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం కూడా దూరదర్శన్ ఛానెల్ ద్వారా పాఠాలు చెప్పడానికి నిర్ణయించింది.