గుంటూరు లో కొత్తగా ఎనిమిది కేసులు..!

post

గుంటూరుజిల్లాలో కూడా ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 41 కేసులు నమోదు కాగా, అందులో 27 కేసులు ఒక్క గుంటూరు లోనే నమోదు కావడం గమనార్హం. వీరిలో ఎక్కువమంది ఢిల్లీ లో తబ్లీగి జమాత్ కు వెళ్లి వచ్చిన వారే ఉన్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లా కలెక్టరు శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. మంగళదాస్ నగర్, కుమ్మరి బజార్, ఆనందపేట, బుచ్చయ్యతోట, నల్లచెరువు, సంగడిగుంట, శ్రీనివాసరావుతోట, ఆటోనగర్, ఎల్బీనగర్, కొరిటపాడు వంటి ప్రాంతాలను రెడ్ జోన్లు గా ప్రకటించినట్లు ఆయన తెలిపారు. ల్లీ వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు, ‘కరోనా’ లక్షణాలు ఉన్న వారు పరీక్షల నిమిత్తం ముందుకు రావాలని ఆయన సూచించారు. అలానే, ఆరెంపీ వైద్యులను కూడా తమ క్లినిక్ లను మూసి వేయాల్సింది గా సూచించారు. రెడ్ జోన్లలో ప్రజలను ఇళ్లనుంచి బయటకు రావద్దని చెప్పారు. నిత్యావసరాల కొనుగోలు చేసే సమయాన్ని ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు తగ్గించామని తెలిపారు.