ముంబై లో వలస కార్మికులకు తెలంగాణ మంత్రి సాయం..!

post

లాక్ డౌన్ కారణం గా దేశ వ్యాప్తం గా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ కు చెందిన కొందరు కార్మికులు కూడా ముంబై లో చిక్కుకుపోయారు. కొందరు ధైర్యం చేసి కాలినడకన వచ్చేసినా, చాల మంది అక్కడే చిక్కుకుపోయారు. వీరంతా ప్రస్తుతం తిండి కి డబ్బుల్లేక, చేసుకోవడానికి పనులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి చేరడం తో వెంటనే ఆయన స్పందించి గూగుల్ పే ద్వారా 90 వేల సాయాన్ని అందించారు. వారంతా మంత్రి తమ పాలిట దేవుడని కొనియాడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు 364 కు చేరుకున్నాయి. ఈరోజు 12 మంది ఆసుపత్రి నుంచి పూర్తి  గా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. మరో 30 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు 45 మంది కోలుకోగా, 11 మంది మృతి చెందారు.